'ప్రేమసాగరం' సినిమాలో ఛాన్స్ అలా వచ్చింది: సీనియర్ హీరోయిన్ నళిని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్రేమసాగరం' సినిమాలో ఛాన్స్ అలా వచ్చింది: సీనియర్ హీరోయిన్ నళిని

  • మొదట మలయాళ మూవీ చేశాను 
  • రెండో సినిమాతో మరింత క్రేజ్ 
  • అలా 100 సినిమాలు చేసేశాను    
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లోని సీనియర్ కథానాయికల జాబితాలో నళిని పేరు కూడా కనిపిస్తుంది. అప్పట్లో ఆమె తమిళంలో చేసిన 'ప్రేమసాగరం' తెలుగులోను ఏడాది పాటు ఆడేసింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లోను ఆమె నటించారు. అలాంటి నళిని తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి చెప్పుకొచ్చారు.

 " వెండితెరకి నేను మలయాళ మూవీ 'ఇడవేళ' ద్వారా పరిచయమయ్యాను. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు వ్యక్తులు .. నేను స్కూల్ కి వెళ్లి వస్తుండగా చూశారు. అలా రెండు రోజులు నన్ను గమనించి మూడో రోజు మా ఇంటికి వచ్చారు. 'ఇడ వేళ' సినిమాలో హీరోయిన్ గా నన్ను అడగడానికి వచ్చినట్టుగా అమ్మానాన్నలకు చెప్పారు. నాకు ఇష్టం లేకపోయినా .. మా అమ్మ ఒప్పించి చేయించింది. నన్ను పెద్ద హీరోయిన్ ను చేయాలనేది మొదటి నుంచి ఆమె కోరిక. ఆ తరువాత చేసిన సినిమాతో మరింత మంచి పేరు వచ్చింది. అప్పుడు టి.రాజేందర్ గారు వచ్చి 'ప్రేమ సాగరం' సినిమా కోసం హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమా నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు .. 100 సినిమాల వరకూ చేసేశాను" అని చెప్పుకొచ్చారు. 
nalini

More Telugu News