అభిమానులకు మరో గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్!

  • 'అరవింద సమేత వీర రాఘవ' మోషన్ టీజర్ విడుదల
  • నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ లో మాస్ ఎన్టీఆర్
  • నేడు రొమాంటిక్ గా కనిపిస్తున్న యంగ్ టైగర్
నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' ఫస్ట్ లుక్ నిన్న విడుదల కాగా, నేడు అభిమానులకు మరో సర్ప్రయిజ్ గిఫ్ట్ లభించింది. సినిమా మోషన్ టీజర్ విడుదలైంది. శనివారం నాడు సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసిందే. నేడిక ఎన్టీఆర్ లోని రొమాంటిక్ యాంగిల్ ను చూపిస్తూ, హీరోయిన్ పూజా హెగ్డేతో ఉన్న మోషన్ టీజర్ ను ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  'అరవింద సమేత వీర రాఘవ' మోషన్ టీజర్ ను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
NTR
Aravinda Sameta
First Look
Motion Teaser

More Telugu News