Hyderabad: సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. యువకుడి ఆత్మహత్య!

  • సరూర్ నగర్ లో యువకుడి ఆత్మహత్య
  • సూసైడ్ ను సెల్ఫీ వీడియో తీసిన వైనం
  • కలకలం రేపుతున్న ఆత్మహత్య
హైదరాబాదులో ఓ యువకుడు సెల్ఫీ సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. అనిల్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్యను ఫోన్ ద్వారా సెల్ఫీ వీడియో తీశాడు. మృతుడు అనిల్ సరూర్ నగర్ లో ఉంటున్నాడు. ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. డిప్రెషన్ లోనే అనిల్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్ స్వగ్రామం ఘట్ కేసర్ మండలంలోని అనూజగూడెం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Hyderabad
suicide
anil

More Telugu News