'మెర్సల్ ' డైరెక్టర్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్?
- భారీ విజయాలను అందుకున్న అట్లీ కుమార్
- తెలుగు సినిమాల పట్ల ఆసక్తి
- ఆయనతో చేయడానికి రెడీగా ఎన్టీఆర్
ఆ మధ్య వరుసగా తెలుగు స్టార్ హీరోలను ఆయన కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లలో తాజాగా ఎన్టీఆర్ స్పందించినట్టుగా సమాచారం. మంచి కథ కుదిరితే చేయడానికి తాను సిద్ధమని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం అట్లీ కుమార్ కూడా కొత్త ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. ఇక త్రివిక్రమ్ .. రాజమౌళి సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేయవలసి వుంది. ఆ తరువాత ఎన్టీఆర్ .. అట్లీ కుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.