Sania Mirza: ఉమ్రా యాత్రకు వెళ్లిన సానియా మీర్జా దంపతులు!

షార్ట్స్‌లో చూడండి
ముస్లింల పవిత్ర స్థలం ఉమ్రా యాత్రకు ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దంపతులు తమ తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ఈ యాత్రకు వెళ్లారు. ఉమ్రా యాత్ర నిమిత్తం సానియా, తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, తల్లిదండ్రులతో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి చేరుకున్న సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను షోయబ్ మాలిక్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా, ఈ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తూ విషెస్ చెబుతున్నారు. ఉమ్రా యాత్ర విజయవంతంగా జరగాలని, అల్లా దీవెనలు ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఫొటోలు బాగున్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Go Back to Shorts
Sania Mirza
shoyab malik

More Telugu News