సింగపూర్‌లో రాజకీయ చర్చలు జరుపుతోన్న జేడీఎస్ నేత కుమారస్వామి
- హంగ్ ఏర్పడుతుందంటోన్న ఎగ్జిట్ పోల్స్
- కింగ్ మేకర్‌గా జేడీఎస్
- జేడీఎస్ మద్దతెవరికి? అన్న ఉత్కంఠ
- కర్ణాటకలో ఉంటే మీడియాకు తెలిసిపోతుందనే సింగపూర్‌కు
ఇటువంటి సమయంలో జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్‌లో ఉన్నారు. మొన్న పోలింగ్ ముగియగానే ఆయన అక్కడకు వెళ్లిపోవడంతో.. ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై చర్చలు జరిపేందుకే ఆయన వెళ్లినట్లు కొందరు భావిస్తున్నారు. కుమారస్వామి సన్నిహితుడు ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు తమ పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నారని, ఈ చర్చల్లో పాల్గొనేందుకే కుమారస్వామి సింగపూర్ వెళ్లి ఉండొచ్చని అనడం గమనార్హం. ఒకవేళ చర్చలు ఇక్కడే జరిగితే ఆ విషయాలన్నీ మీడియాకు తెలిసే అవకాశముంటుందని చెప్పారు.