anu emmanuel: అనూ ఇమ్మాన్యుయేల్ ఫీలవుతోందట, పాపం!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకి 'మజ్ను' సినిమా ద్వారా పరిచయమైన అనూ ఇమ్మాన్యుయేల్ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చేసిన 'కిట్టు వున్నాడు జాగ్రత్త' కూడా ఆమెకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సమయంలోనే ఆమెకి పవన్ సరసన 'అజ్ఞాతవాసి' .. అల్లు అర్జున్ జోడీగా 'నా పేరు సూర్య'లో అవకాశాలు వచ్చాయి.పెద్ద బ్యానర్లు .. స్టార్ హీరోలు .. ఈ సినిమాలు హిట్ అయితే తన దశ తిరిగిపోతుందని అనూ ఇమ్మాన్యుయేల్ భావించింది. అయితే అటు 'అజ్ఞాతవాసి'గానీ .. ఇటు 'నా పేరు సూర్య' గాని ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను రాబట్టలేకపోయాయి. దాంతో ఆమె డీలాపడిపోయిందని అంటున్నారు. వ్యక్తిగత కారణాల వలన 'నా పేరు సూర్య' థ్యాంక్స్ మీట్' కి రాలేకపోయినట్టుగా ఆమె చెప్పినప్పటికీ, అసలు కారణం  అప్సెట్ కావడమేనని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ 'శైలజా రెడ్డి అల్లుడు' పైనే!  
Go Back to Shorts
anu emmanuel

More Telugu News