ఎన్టీఆర్ మూవీ కోసం తమన్ కసరత్తు .. రెండు సాంగ్స్ రెడీ
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ మూవీ కోసం తమన్ కసరత్తు .. రెండు సాంగ్స్ రెడీ

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ
  • ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే 
  • దసరాకి విడుదల చేసే ఆలోచన  
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయి.

ఇప్పటికి ఆయన రెండు సాంగ్స్ ను కంపోజ్ చేసినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ క్రేజ్ ను .. త్రివిక్రమ్ టేస్ట్ ను దృష్టిలో పెట్టుకుని, ఎన్టీఆర్ అభిమానులు ఆయన సినిమా నుంచి ఆశించే డాన్స్ లను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్స్ ను కంపోజ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రెండు పాటలు కూడా చాలా బాగా వచ్చాయని అంటున్నారు. ఈ సినిమాకి 'అసామాన్యుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
ntr
pooja hegde

More Telugu News