rajamouli: రాజమౌళి మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఇదేనా?

షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి తన తాజా చిత్రం కోసం కథపై చాలాకాలం పాటు కసరత్తు చేశారు. ఈ కథకి సరైన కథానాయకులు ఎన్టీఆర్ .. చరణ్ అంటూ వాళిద్దరినీ ఒప్పించారు. అప్పటి నుంచి అంతా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ ను కేటాయించారు?ఎలాంటి టైటిల్ పెట్టనున్నారు? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'ఇద్దరూ ఇద్దరే' అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలు రెండూ సమానంగా ఉంటాయట. ఈ రెండు పాత్రలు కూడా పోటీపడుతూ సమాంతరంగా సాగుతాయి. అందువల్లనే ఈ టైటిల్ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. ఆగస్టు నుంచి నటీనటుల ఎంపికను మొదలెట్టి .. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళతారట.   
Go Back to Shorts
rajamouli
ntr
charan

More Telugu News