భారీగా ఒళ్లు ఉంటుంది.. కానీ బుద్ధి ఉండదు: కేసీఆర్

  • కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ కేసీఆర్
  • టీఆర్ఎస్ నేతలు బక్కగా ఉన్నా పెద్దపెద్ద పనులు చేస్తున్నారు
  • కాళేశ్వరం పూర్తయితే మూడు పంటలు పండించుకోవచ్చు
టీఆర్ఎస్ పార్టీ నేతలంతా బక్కగా, సన్నగా ఉన్నప్పటికీ పెద్దపెద్ద పనులు చేస్తున్నామని... కాంగ్రెస్ నేతలకు భారీగా ఒళ్లు ఉన్నా, బుధ్ది మాత్రం ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని, ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు వింటే ఆగమైపోతారని అన్నారు. హుజూరాబాద్ లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల పాటు ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టినా ఏనాడూ మాట్లాడని కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు టీఆర్ఎస్ అన్నీ పూర్తి చేస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని కేసీఆర్ చెప్పారు. అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మూడు పంటలు పండించుకోవచ్చని చెప్పారు. 950 టీఎంసీల గోదావరి నీటిని వాడుకునేందుకు ప్రణాళికలను రచిస్తున్నామని తెలిపారు. 
Go Back to Shorts
kcr
TRS
congress
keleswaram
raithu bandhu

More Telugu News