prabhas: హీరోయిన్ కోసం మరోసారి కొండలెక్కనున్న ప్రభాస్!

షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' సినిమాలో కథానాయికను కలుసుకోవడానికి ప్రభాస్ .. జలపాతం మీదకి దూకుతున్నా లెక్కచేయకుండగా కొండనెక్కేస్తాడు. అలా ఎంతో కష్టపడి కొండపైకి చేరుకొని, కథానాయికను కలుసుకుంటాడు. ఈ ఎపిసోడ్ అంతా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సంగతిని అలా ఉంచితే .. మరోసారి కథానాయిక కోసం ప్రభాస్ కొండలనెక్కనున్నాడనేది తాజా సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన కొండలనెక్కనున్నాడని అంటున్నారు. కథానాయిక కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ .. ఇవే సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు.        
Go Back to Shorts
prabhas
pooja hegde

More Telugu News