Karnataka: చంద్రబాబు, కేసీఆర్‌ కర్ణాటకలో మమ్మల్ని గెలిపిస్తారు: దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్య

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో తామే కీలక పాత్ర పోషిస్తామని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌‌ తమను గెలిపిస్తారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో తామే ముందంజలో ఉంటామని దేవెగౌడ అన్నారు.

కాగా, కర్ణాటకలో హంగ్‌ ఏర్పడుతుందని, జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ అవుతుందని పలు సర్వేలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, దేవెగౌడ కుమారుడు కుమారస్వామి తాము ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌ కాదని, కింగేనని ఇటీవల అన్నారు. తాము సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. 
Go Back to Shorts
Karnataka
devegouda
Chandrababu
KCR

More Telugu News