15 రోజుల్లోగా దాచేపల్లి మృగాడిని పట్టుకోకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తా!: గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు
- నిరసనలు తెలియజేస్తున్న వారితో మాట్లాడిన అప్పలనాయుడు
- 15 రోజుల సమయం కావాలని వినతి
- శాంతి భద్రతల సమస్యగా మార్చవద్దని విజ్ఞప్తి
- సుబ్బయ్యకు ఉరిశిక్ష పడేలా చూస్తానని హామీ
తన మాట వినాలని, సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చవద్దని కోరారు. నిందితుడి కుటుంబ సభ్యులంతా తమ అధీనంలోనే ఉన్నారని, సుబ్బయ్య తప్పించుకునే అవకాశం లేదని నచ్చజెప్పారు. అతనికి ఉరిశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిరసనలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. నిరసనకారులు వర్షంలోనూ తమ ఆందోళన కొనసాగిస్తూ ఉండటంతో పిడుగురాళ్ల నుంచి కారంపూడి, మాచర్ల మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు.