charmi: 'మెహబూబా' సెన్సార్‌ పూర్తి.. హ్యాపీగా ఉందన్న ఛార్మీ

షార్ట్స్‌లో చూడండి
తన కుమారుడు ఆకాశ్‌ హీరోగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రూపుదిద్దిన 'మెహబూబా' సినిమా ఈ రోజు సెన్సార్‌ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సినిమాను ఈ నెల 11న విడుదల చేయనున్నారు. హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు.. శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా సినీ నటి ఛార్మీ.. తనకు చాలా హ్యాపీగా ఉందంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తమ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుందని, సెన్సార్‌ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పింది. ఆకాశ్ చాలా బాగున్నాడని, లవ్‌ స్టోరీ చాలా బాగుందని సెన్సార్‌ సభ్యులు తమతో పదే పదే చెప్పడం తమకు చాలా ఎనర్జీనిచ్చిందని తెలిపింది.    
Go Back to Shorts
charmi
Puri Jagannadh
mehbooba

More Telugu News