చంద్రబాబు స్ఫూర్తితో సైకిల్ యాత్రలో పాల్గొన్నా : హాస్యనటుడు వేణుమాధవ్

  • హిందూపురం సమీపంలోని కిరికెరలో సైకిల్ యాత్ర ప్రారంభం
  • ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపింది
  • ‘హోదా’ సాధించే వరకూ మా ఉద్యమం కొనసాగుతుంది
ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పోరాడుతున్న సీఎం చంద్రబాబు స్ఫూర్తితో తాను కూడా సైకిల్ యాత్రలో పాల్గొన్నానని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అన్నారు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హిందూపురం సమీపంలోని కిరికెర నుంచి ఈ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. తొలుత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని, ‘హోదా’ సాధించే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
comedian venumadhav

More Telugu News