రేపు రాత్రి నుంచి మూతపడనున్న ఐఆర్సీటీసీ వెబ్ సైట్... వివరాలు!
- గురువారం రాత్రి 10.45 గంటలకు మూత
- ఆరు గంటలకు పైగా మూడపడనున్న వెబ్ సైట్
- వెల్లడించిన ఐఆర్సీటీసీ
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ ను మరింత స్నేహపూర్వకంగా మార్చనున్నామని, ఇందులో భాగంగా కొత్త ఫీచర్లు ప్రవేశపెడతామని కూడా సంస్థ తెలిపింది. మొత్తం ఆరు గంటల పాటు ఈ మూసివేత ఉంటుందని, రైల్వే స్టేషన్లలోని ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్ లతో పాటు కాల్ సెంటర్, 139 విచారణ తదితరాలు కూడా అందుబాటులో ఉండవని, తమ కస్టమర్లు సహకరించాలని కోరింది.