మోదీ వీడియోలను చూపారు సరే.. మరి చంద్రబాబు చెప్పిన మాటల వీడియోలను ఎందుకు ప్రదర్శించలేదు?: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ వీడియోలను చూపారు సరే.. మరి చంద్రబాబు చెప్పిన మాటల వీడియోలను ఎందుకు ప్రదర్శించలేదు?: రోజా

  • వెంకన్న సాక్షిగా బీజేపీతో చంద్రబాబు స్నేహం చేశారు
  • పిచ్చోడి చేతిలో రాయి, చంద్రబాబు చేతిలో మైకు ఒకటే
  • ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు
తిరుపతిలో టీడీపీ నిర్వహించిన ధర్మపోరాట సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు వీడియోలను ప్రదర్శిస్తూ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వెంకన్న సాక్షిగా బీజేపీతో చంద్రబాబు స్నేహం చేశారని, తిరుపతిలో ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు చెబుతోన్న మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని రోజా చెప్పుకొచ్చారు. పిచ్చోడి చేతిలో రాయి, చంద్రబాబు చేతిలో మైకు ఒక్కటేనని... పిచ్చోడి చేతిలో రాయి ఉంటే విసురుతాడని, అలాగే చంద్రబాబు చేతిలో మైక్‌ ఉంటే ఆయన ఏం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదని అన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నానని చెబుతోన్న చంద్రబాబు.. టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యను ఎలా నియమించారని రోజా ప్రశ్నించారు.   
roja
YSRCP
Narendra Modi
Chandrababu

More Telugu News