కేసీఆర్ ఫ్రంట్ ను అమిత్ షా ఎలా స్వాగతిస్తారు?: సురవరం సుధాకర్ రెడ్డి
- బీజేపీకి మేలు చేయడానికే కేసీఆర్ ఫ్రంట్
- ఫ్రంట్ ను అమిత్ షా స్వాగతించడమే దీనికి నిదర్శనం
- రాజకీయ అవగాహన ఉన్నవారెవరూ ఈ ఫ్రంట్ లో చేరరు
బీజేపీకి మేలు చేయడం కోసమే కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని ఆయన విమర్శించారు. థర్డ్ ఫ్రంట్ ను అమిత్ షా స్వాగతించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న వారెవరూ కేసీఆర్ ఫ్రంట్ లో చేరబోరని అన్నారు. వామపక్షాలు, తమతో పాటు కలసి వచ్చే పార్టీలతో కలసి ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.