'మెహబూబా'లో ఛాన్స్ అలా వచ్చింది: నేహా శెట్టి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మెహబూబా'లో ఛాన్స్ అలా వచ్చింది: నేహా శెట్టి

  • ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
  • కథానాయికగా నేహా శెట్టి 
  • వచ్చేనెల 11వ తేదీన రిలీజ్  
పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ హీరోగా 'మెహబూబా' సినిమాను రూపొందించాడు. ఈ ప్రేమకథా చిత్రాన్ని ఆయన మే 11వ తేదీన విడుదల చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నేహా శెట్టి నటించింది. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విషయాలను ప్రస్తావించింది.

''పూరీ జగన్నాథ్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కావడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వచ్చాను. ఆడిషన్స్ తరువాత పూరీ గారు నన్ను ఎంపిక చేశారు. ఆకాశ్ తో కలిసి నటించడం సంతోషంగా వుంది. సెట్లో ఆయన చాలా సరదాగా వుంటాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే మాత్రం .. పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సమయంలో ఆయన చాలా సీరియస్ గా పాత్రపైనే దృష్టిపెడతాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.        
akash
neha shetty

More Telugu News