సందేశాల కోసం సినిమాలు తీసే పరిస్థితి లేదు ..ఇక కొత్తగా ట్రై చేస్తాను: కొరటాల

  • సినిమా అనేది ఒక వ్యాపారం 
  • ఎంతోమంది డబ్బు అందులో ఉంటుంది
  • అందుకే కమర్షియల్ గాను ఆలోచిస్తాను  
కొరటాల శివ ఇంతవరకూ చేసినవి నాలుగే సినిమాలు. ప్రతి సినిమాలోను వినోదం .. సందేశం సమపాళ్లలో కనిపిస్తాయి. ఈ నాలుగు కూడా ఆయా హీరోల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. సందేశంతో కూడిన సినిమాలు చేయాలంటే అది కొరటాల వల్లనే అవుతుందంటూ అంతా ఆయనను ప్రశంసిస్తున్నారు.

 ఈ నేపథ్యంలో కొరటాల స్పందిస్తూ .. తనని అంత మంచివాడిగా చేయవద్దని ఆయన అన్నారు. సినిమా అనేది చాలా పెద్ద వ్యాపారమనీ, ఎంతోమంది డబ్బుతో అది ముడిపడి ఉంటుందని ఆయన చెప్పారు. అందువలన కేవలం సందేశం కోసం సినిమాలు చేసే పరిస్థితి లేదని అన్నారు. కమర్షియల్ విషయాలను దృష్టిలో పెట్టుకునే తాను కథను అల్లుకుంటానని చెప్పారు. ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒక ఫార్మేట్ లో సాగిపోయాయనీ, ఇక నుంచి తన సినిమాలు కొత్త తరహాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
koratala

More Telugu News