Jagan: ఎన్డీయేలోకి జగన్ ను ఆహ్వానించిన కేంద్ర మంత్రి అథవాలే

షార్ట్స్‌లో చూడండి
ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం తప్పుకోవడం బాధాకరమని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఎన్డీయేలోకి టీడీపీ మళ్లీ వస్తే బాగుంటుందని చెప్పారు. ఏపీలో వైకాపా కూడా బలమైన పార్టీ అని... ఎన్డీయేలో చేరాలంటూ ఆ పార్టీ అధినేత జగన్ ను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఏపీకి అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే... ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు సరిగా లేదని చెప్పారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి బీజేపీ కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరారు.


Go Back to Shorts
Jagan
YSRCP
BJP
NDA

More Telugu News