jabardasth: రైల్వే స్టేషన్‌లో గొడవకు దిగి రచ్చ చేసిన జబర్దస్త్ నటులు.. మీడియాకు చిక్కిన దృశ్యాలు
- జనరల్ టికెట్ తీసుకున్న జబర్దస్త్ నటులు
- థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణించినట్లు సమాచారం
- టీసీతో గొడవపడ్డ వైనం
టీవీ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ నటులు రైల్వే స్టేషన్‌లో టీసీతో గొడవ పెట్టుకున్న ఘటన విశాఖపట్నం స్టేషన్‌లో చోటు చేసుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షేకింగ్ శేషు టీసీతో గట్టిగా మాట్లాడుతూ కెమెరాకు చిక్కాడు. వారంతా విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు జనరల్ టికెట్ తీసుకున్నారు.
అయితే, థర్డ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేయడంతో టీసీ అభ్యంతరం చెప్పారు. ఈ కారణంగానే టీసీపై జబర్దస్త్ నటులు మండిపడి వాగ్వివాదానికి దిగినట్లు తెలిసింది. సదరు నటులపై టీసీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి మీడియా అక్కడకు రావడంతో జబర్దస్త్ నటులు చివరకు ఆ గొడవకు స్వస్తి చెప్పారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.