నా దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులు వాళ్లిద్దరే! : కమెడియన్ పృథ్వీరాజ్
Add ap7am to your home Screen

నా దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులు వాళ్లిద్దరే! : కమెడియన్ పృథ్వీరాజ్

  • అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి ఎన్టీఆర్
  • మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి
  • తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ
తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే.

నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి ఎక్కువే. పోసాని గారిని అన్నయ్య అనాలో, తమ్ముడు అనాలో గానీ.. రాజకీయాలంటే మా తమ్ముడికీ ఆసక్తే. వ్యక్తిగతంగా ఎవరిపైనా మేము నోరుపారేసుకోం. ఇంట్లో అయినా, బయట అయినా మేము ఉన్నదున్నట్టు మాట్లాడతాం. ఎవరైనా కొట్టారనుకోండి, కొట్టించుకుంటాం. మనం కొట్టే స్థాయి ఉంటే కొడతాం. పదిమందిని తీసుకొచ్చి కొట్టారనుకోండి కొట్టించుకుంటాం.. మనం పది మందిని తీసుకెళ్లి కొట్టే స్థాయి వచ్చినప్పుడు కొడతాం.. అది నా సిద్ధాంతం. ప్రజల మధ్య నిరంతం ఉండి సమస్యల గురించి పోరాడే వాళ్లంటే నాకు ఇష్టం. జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ గారు..ఇలా ఎవరైనా’ అని చెప్పుకొచ్చారు.
Tollywood
prudhviraj
ntr
ysr

More Telugu News