'పెళ్లి చేసుకుంటా.. ఓ సారి బయటకు పంపండి' అంటూ అబూ సలేం పిటిషన్!
- ముంబ్రా ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లికి ప్రయత్నాలు
- అనుమతి లభిస్తే మే 5న పెళ్లి చేసుకునే యోచన
- ఆమెను ఫోన్లో పెళ్లి చేసుకున్నానంటూ గతంలో ప్రకటన
దీంతో తనను వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అబూ సలేంను పెళ్లి చేసుకోవడం మినహా తనకు మరో మార్గం లేదని కౌసర్ బాహర్ వాపోయింది. సలేంను పెళ్లి చేసుకునేందుకు అనుమతించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆమె బెదిరించింది. నిజానికి ఈమెను పెళ్లి చేసుకునేందుకు అనుమతి కోరుతూ అబూ సలేం గతంలోనూ పలు మార్లు అనుమతి కోరినప్పటికీ ఫలితం లభించలేదు. అబూ సలేం గతంలో నటి మోనికాబేడీ, సమీరా జుమానీ అనే ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుని వారికి దూరమయ్యాడు.