charan: 'రంగస్థలం' హిట్ కావడానికి కారణాలు ఇవే!: సుకుమార్

షార్ట్స్‌లో చూడండి
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధించింది. వసూళ్ల పరంగా 'బాహుబలి' .. 'బాహుబలి 2' తరువాత స్థానంలో ఇది నిలిచింది. చరణ్ .. సమంత .. జగపతిబాబు కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోయింది. ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి కారణాలేమిటి? అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో సుకుమార్ కి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .." ఏ సినిమా అయినా సక్సెస్ కావడానికి కథా కథనాలే ప్రధానమైన కారణాలవుతాయి. కథా కథనాలు సరిగ్గా లేనప్పుడు మిగతా విషయాలకి ప్రాధాన్యతనిచ్చినా ప్రయోజనం ఉండదు. ఇదే కథను కొత్త వాళ్లతో చేస్తే వచ్చే రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. చరణ్ స్టార్ హీరో కనుక ఆయనతో చేస్తే ఇలా వుంది. కథ ఏ మాత్రం బాగున్నా స్టార్ హీరోలు దాన్ని జనంలోకి మోసుకెళ్లిపోతారు .. స్టార్ హీరోలకి గల ప్లస్ అదే. కథా కథనాలు .. చరణ్ స్టార్ ఇమేజ్ .. ఆయన నటన .. ఈ సినిమా సక్సెస్ కి ప్రధానమైన కారణాలని సుకుమార్ చెప్పారు.  
Go Back to Shorts
charan
samanta

More Telugu News