Pawan Kalyan: నిరసన బలంగా తెలపడానికే బంద్ కి మద్దతు ఇచ్చాం!: పవన్ కల్యాణ్

  • హోదా సాధన మన రాష్ట్రానికి చాలా ముఖ్యం
  • కాబట్టి నిరసన బలంగా తెలపడానికి బంద్‌కు మద్దతిచ్చాం
  • బంద్ శాంతియుతంగా నిర్వహించారు
  • పార్టీ శ్రేణులకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఒక రోజు బంద్‌ను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. "రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరి. ఇది తాము సాధించుకునే హక్కు అనే ప్రజానీకం అభీష్టాన్ని ఈ బంద్ వెల్లడించింది. ఈ కార్యక్రమం శాంతియుతంగా సాగింది.. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

ప్రజలకు అసౌకర్యం కలిగించే బంద్ లాంటివి చేయడం మా పార్టీ విధానం కాదు. అయినప్పటికీ ప్రత్యేక హోదా సాధన మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది కాబట్టి నిరసన బలంగా తెలపడానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతుగా నిలిచాం. బంద్ శాంతియుతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు అభినందనలు" అని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh