gold: ఈ రోజు కాస్త తగ్గిన పసిడి ధర

షార్ట్స్‌లో చూడండి
బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.100 తగ్గి రూ.32,000కు చేరింది. స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా పరిస్థితుల కారణంగా ఈ రోజు బంగారం ధర తగ్గిందని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా పసిడి ధర బాటలోనే పయనించి రూ.100 తగ్గి కేజీ ధర రూ.39,900గా నమోదైంది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 0.13 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా నమోదయ్యాయి.
Go Back to Shorts
gold
silver
rate

More Telugu News