Tollywood: ఏపీ మంత్రి లోకేశ్ ను కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి నారా లోకేశ్ తో టాలీవుడ్ సినీ నిర్మాతలు కేఎస్ రామారావు, దిల్ రాజు, ఠాగూర్ మధు తదితరులు భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో వారు మాట్లాడుతూ, ఫైబర్ గ్రిడ్ కంటెంట్ అభివృద్ధిలో భాగంగా ఫైబర్ గ్రిడ్ తో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. థియేటర్లలో విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, కేబుల్ టీవీలో ప్రసారమయ్యేలా చర్యలు తీసుకోవడం, సినిమా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం లాంటి సేవలను ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు అందించబోతున్నట్టు చెప్పారు.

 నవ్యాంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి, స్టూడియోల నిర్మాణం, ఫిల్మ్ నగర్ లాంటి వాతావరణం ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రణాళికతో వస్తామని, ప్రభుత్వ సహకారం కావాలని లోకేశ్ ని కోరామని చెప్పారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తికి లోకేశ్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారమందిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
Go Back to Shorts
Tollywood
Nara Lokesh

More Telugu News