nagashourya: నాగశౌర్య కొత్త నిర్ణయం .. మెహ్రీన్ ప్లేస్ లోకి కల్యాణి ప్రియదర్శన్

షార్ట్స్‌లో చూడండి
'ఛలో' సినిమా ఇచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకోవడానికిగాను నాగశౌర్య .. తదుపరి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అలాగే తన సొంత బ్యానర్లోని సినిమాల విషయంలోను ఆయన మరింత శ్రద్ధ పెడుతున్నాడు. తన సొంత బ్యానర్లో ఆయన చక్రవర్తి అనే దర్శకుడిని పరిచయం చేస్తూ .. ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

నిన్నటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకోనున్నట్టు చూచాయగా తెలియజేయడం జరిగింది. కానీ చివరిలో మెహ్రీన్ కి బదులుగా ఆమె స్థానంలో కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. తన జోడీగా మెహ్రీన్ కంటే కల్యాణి ప్రియదర్శన్ అయితేనే బాగుంటుందని నాగశౌర్య భావించడమే అందుకు కారణమని అంటున్నారు. గ్లామర్ పుష్కలంగా ఉన్నప్పటికీ మెహ్రీన్ కి ఒక ఛాన్స్ చేజారిపోయిందన్న మాట.    
Go Back to Shorts
nagashourya
kalyani priyadarshan

More Telugu News