ఎమ్మెల్యే రోజాపై మండిపడ్డ ఏపీ మంత్రి అఖిలప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యే రోజాపై మండిపడ్డ ఏపీ మంత్రి అఖిలప్రియ

  • రోజాకు ఎదుటివారిని విమర్శించడం మాత్రమే తెలుసు
  • అప్పట్లో అసెంబ్లీ నుంచి సస్పెండయినప్పటికీ తీరు మార్చుకోలేదు
  • బీజేపీతో కలిసి జగన్, పవన్ కుట్ర
టీడీపీపై విరుచుకుపడుతూ మాటల తూటాలు పేల్చుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. రోజాకు ఎదుటివారిని విమర్శించడం మాత్రమే తెలుసని, ఆమె అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండయినప్పటికీ తీరు మార్చుకోలేదని అన్నారు. ఈ రోజు ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ... బీజేపీతో కలిసి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమపై కుట్ర చేస్తున్నారని అఖిల ప్రియ ఆరోపించారు.

ప్రత్యేక హోదా కోసం టీడీపీ మాత్రమే పోరాటం చేస్తోందని అఖిలప్రియ అన్నారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. ఏపీకి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా తాము కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని, ప్రజలందరినీ చైతన్య పరుస్తామని అన్నారు.
akhila priya
Andhra Pradesh
roja

More Telugu News