ntr: ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిల సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు!

షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలను రాజమౌళి ఇంతవరకు వెల్లడించనప్పటికీ... ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ప్రచారం అవుతోంది. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారట. రూ. 250 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున ఈ సినిమా నిర్మాణం జరగబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఈ బడ్జెట్ లో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి రెమ్యునరేషన్ కే రూ. 75 కోట్లు అవుతోందనే ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, సినిమాకు సంబంధించిన కథను కూడా రాజమౌళి ఇంతవరకు వెల్లడించలేదు. కానీ, ఎవరికి తోచిన కథను వారు ఊహించేసుకుంటున్నారు. ముఖ్యంగా రెండు కథలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కథ అని కొందరు చెబుతున్నారు. 1980 నేపథ్యంలో సాగే కథ అని మరి కొందరు చెబుతున్నారు. ఈ వార్తల్లో నిజం ఎంతుందో కానీ... ఈ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. రాజమౌళి అధికారికంగా స్పందిస్తే తప్ప... ఏది తప్పో, ఏది నిజమో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Go Back to Shorts
ntr
junior ntr
Ramcharan
Rajamouli
news

More Telugu News