charan: అమెరికాలో కొనసాగుతున్న 'రంగస్థలం' హవా!

షార్ట్స్‌లో చూడండి
క్రితం నెల 30వ తేదీన 'రంగస్థలం' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఇంతవరకూ ఈ సినిమా అక్కడ 20.77 కోట్లను రాబట్టినట్టు సమాచారం. ఈ సినిమా ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం నిజంగా విశేషమని అంటున్నారు.

గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. తెలుగుదనం నిండిన పాత్రలు .. పాటలను సైతం పల్లెచుట్టూ తిప్పిన తీరు ఈ సినిమాకి అక్కడ ఇంతటి ఆదరణ లభించేలా చేశాయని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 150 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టి, అదే జోరుతో ముందుకు వెళుతోంది. ఇది చరణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచినందుకు మెగా అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు.  
Go Back to Shorts
charan
samanta

More Telugu News