charan: తన రికార్డును క్రాస్ చేసి .. తండ్రి రికార్డు దిశగా దూసుకెళుతోన్న చరణ్!

షార్ట్స్‌లో చూడండి
విడుదలైన ప్రతి ప్రాంతంలోను 'రంగస్థలం' విజయవిహారం చేస్తోంది .. కొత్త రికార్డులను సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'మగధీర' రికార్డు (150 కోట్ల గ్రాస్)ను అధిగమిస్తుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా 'రంగస్థలం' 11 రోజుల్లోనే 151.29 కోట్లను వసూలు చేసి .. 'మగధీర'ను మించిపోయింది.

ఇక వసూళ్ల పరంగా చరణ్ ముందు మరో రికార్డుగా నిలిచింది .. 'ఖైదీ నెంబర్ 150'. చిరంజీవి చేసిన ఈ సినిమా 164 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డుకు చరణ్ దగ్గరలో వున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ రికార్డును చరణ్ క్రాస్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ ఈ సినిమా రికార్డును అధిగమించడం చిరంజీవికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందనేది వేరే చెప్పాల్సిన పనిలేదు.         
Go Back to Shorts
charan
samanta

More Telugu News