'బిగ్‌బాస్-2కి వ్యాఖ్యాత' వార్తలపై స్పందించిన నేచురల్ స్టార్ నాని!
- ఇంత వరకు నా వద్దకు ఆ ప్రస్తావన రాలేదు
- ఒకవేళ వస్తే చెబుతా
- ‘రంగస్థలం’ విజయం సాధించడం ఆనందంగా ఉంది
కాగా, ఆయన నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేర్లపాక గాంధీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు పూర్తిగా విభిన్నంగా అనిపించిందని, నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’ సినిమాకు, దీనికి సంబంధం ఉండదని, ఆ సినిమాలోలా ఈ సినిమాలో కృష్ణ-అర్జున్‌లు అన్నదమ్ములు కాదని అన్నాడు.
ఈ సినిమాలో కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేస్తారని వారు ఎవరిపై, ఎందుకు చేస్తారో థియేటర్లలో చూడండని అన్నాడు. కింగ్ నాగార్జునతో కలిసి ఓ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అన్నాడు. కాగా, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం’ విజయం సాధించడం ఆనందంగా ఉందని, ఈ సీజన్‌లో చాలా సినిమాలు వస్తున్నాయని, అన్నీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నాడు.