Tollywood: మాటల్లేవ్.. పూరి తనయుడి సినిమా ట్రైలర్‌పై చార్మి ఎమోషనల్ ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, నేహ శెట్టి జంటగా తెరకెక్కుతున్న ‘మెహబూబా’ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌లోని యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించింది. దీంతో పూరి కనెక్ట్స్ వ్యవహారాలు చూసుకునే నటి చార్మి స్పందించింది. రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ వచ్చిన విషయాన్ని పోస్టర్‌పై రాసి ‘మాటల్లేవ్.. ఆనంద బాష్పాలే’ అని ట్వీట్ చేసింది.

తాజాగా విడుదలైన ‘మెహబూబా’ ట్రైలర్‌లో ‘దేశాన్ని ప్రేమించే మనసు సైనికుడికి మాత్రమే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు, మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Go Back to Shorts
Tollywood
Mehbooba
Charmi kour
Puri Jagannadh

More Telugu News