RagalaVenkatRahul: కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటిన తెలుగు తేజం

షార్ట్స్‌లో చూడండి
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు రాణిస్తున్నారు. ఈ రోజు భారత్‌కి మరో స్వర్ణం దక్కింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 85 కిలోల విభాగంలో తెలుగు తేజం వెంకట రాహుల్‌ సత్తా చాటి స్వర్ణ పతకం సాధించాడు. వెంకట రాహుల్ గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం వాసి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది నాలుగో పసిడి పతకం. ఇప్పటివరకు ఈ గేమ్స్‌లో భారత్ మొత్తం 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలుచుకుంది. భారత్‌కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల రాహుల్‌పై దేశంలోని ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. స్టువర్టుపురం వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు.
Go Back to Shorts
RagalaVenkatRahul
CommonwealthGames
India

More Telugu News