ఆ హీరోయిన్ నా కారు తిరిగి ఇవ్వడం లేదు: వ్యాపారవేత్త ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ హీరోయిన్ నా కారు తిరిగి ఇవ్వడం లేదు: వ్యాపారవేత్త ఫిర్యాదు

  • కిమ్ శర్మపై కేసు నమోదు చేసిన రాజస్థాన్ వ్యాపారవేత్త దిలీప్ కుమార్
  • కిమ్ ఇంటిదగ్గర కారు పార్క్ చేసుకునే వాడినన్న దిలీప్ కుమార్
  • 2017 లో కేసు నమోదు చేసిన దిలీప్
‘ఖడ్గం’ సినిమాలో నటించి, ‘మగధీర’లో ఐటెం సాంగ్ లో నర్తించిన కిమ్ శర్మపై రాజస్థాన్ వ్యాపారవేత్త దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే... ముంబైలో తనకు నివాసం లేకపోవడానికి తోడు, ముంబై-రాజస్థాన్ మధ్య తరచు ప్రయాణించాల్సి రావడం వల్ల తన రేంజ్ రోవర్ లగ్జరీ కారును కిమ్ శర్మ, ఆమె భర్త అలీ పుంజానీ నివాసం ఉండే ఖర్ రెసిడెన్సీలో పార్క్ చేసుకునే వాడినని దిలీప్ కుమార్ తెలిపారు.

ఏడాది క్రితం కిమ్ తన కారును వాడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీంతో ఆమెను ప్రశ్నించగా, ఆ కారును తన భర్త తనకు ఇచ్చాడని చెబుతూ ఆమె వాపస్ చేసేందుకు నిరాకరించిందని, దీంతో తాను 2017 సెప్టెంబర్ లో దీనిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. అప్పట్లో దీనిపై పోలీసులు కిమ్ శర్మకు బదులుగా ఆమె భర్త అలీ పుంజానీపై కేసు నమోదు చేశారని, కిమ్ శర్మ పేరిట కేసు రిజిస్టర్ చేయాలని ఆయన పోలీసులను కోరారు. 
mumbai
kim sharma
dilip kumar
bussinesmen

More Telugu News