కోడిని కోసుకు తింటే చికెన్ పార్టీ .. మధ్యతరగతి మనిషిని కోసుకుతింటే భారతీయ జనతా పార్టీ!: గంటా శ్రీనివాస్
- నవ్యాంధ్రలో 17 జాతీయ సంస్థలకు 3508 ఎకరాలు కేటాయించాం
- కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది
- కేంద్రం కావాలనే ఏపీకి అన్యాయం చేస్తోంది
నిజాలు చెప్పలేని పరిస్థితిలో గంటా ఉన్నారు : ఎమ్మెల్సీ మాధవ్
కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా సంస్థల గురించి గంటాకు నిజాలు తెలుసని, ఆ నిజాలు చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెం నిట్ నిర్మాణం సగంలోనే ఆగిపోవడానికి కాంట్రాక్టరే కారణమని, ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడానికి ఏడాదిన్నర సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు నిమిత్తం నాలుగు నెలల క్రితమే భూమి ఇచ్చారని మాధవ్ అన్నారు.