నారా రోహిత్ .. జగ్గూ భాయ్ తలపడే సీన్స్ చూసి తీరాల్సిందేనట!
- 'ఆటగాళ్లు'గా నారా రోహిత్ .. జగపతిబాబు
- డబ్బింగ్ పనులు ఈ రోజునే మొదలు
- వేసవిలో భారీస్థాయిలో విడుదల
ఈ ఇద్దరూ తలపడే ఉత్కంఠభరితమైన సన్నివేశాలను చూసితీరవలసిందే అని అంటున్నారు. ఈ ఇద్దరి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను ఈ రోజున మొదలెట్టేశారు. నారా రోహిత్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. దర్శన కథానాయికగా నటించిన ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు.