రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ 250 కోట్లు?
Add ap7am to your home Screen

రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ 250 కోట్లు?

  • మల్టీ స్టారర్ మూవీతో రాజమౌళి 
  • హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్ 
  • అత్యున్నతస్థాయిలో ఉండేలా ప్లాన్    
టాలీవుడ్ అగ్రదర్శకులలో రాజమౌళి పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. కథాకథనాలను పట్టుగా నడిపించడంలోను .. పాత్రలను తీర్చిదిద్దడంలోను రాజమౌళి సిద్ధహస్తులు. అలాంటి రాజమౌళి తదుపరి చిత్రంగా మల్టీస్టారర్ రూపొందనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ గురించిన వార్త ఒకటి వినిపిస్తోంది. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను 250 కోట్లతో నిర్మించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ వంటి స్టార్ హీరోల సరసన మంచి క్రేజ్ వున్న కథానాయికలను ఎంపిక చేయవలసి వుంది. ఇతర తారాగణం కూడా సినిమా భారీతనానికి తగినట్టుగా ఉంటారట. ఇక సాంకేతికంగా కూడా సినిమా ఒక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కారణంగా ఈ సినిమా బడ్జెట్ గా 250 కోట్లను కేటాయించినట్టు తెలుస్తోంది.     
rajamouli
ntr
charan

More Telugu News