ఈ రెండు పార్టీల నేతలను చంద్రబాబు కలవడం లేదు: గల్లా జయదేవ్
- జాతీయ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ కారు
- బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీని ఎలా వంచించాయో వివరించనున్నారు
- ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఎలా నాశనం చేస్తోందో చర్చించనున్నారు
ఈ సందర్భగా బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీని ఏ విధంగా వంచించాయో చంద్రబాబు వివరించనున్నారని... రాష్ట్ర విభజన ఎలా జరిగింది, 2014 ఎన్నికల తర్వాత విభజన హామీలకు బీజేపీ ఎలా తూట్లు పొడిచిందో తెలియజేయనున్నారని వెల్లడించారు. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఎలా నాశనం చేస్తోందో చర్చించనున్నారని చెప్పారు.