విదేశాల్లో షూటింగ్ మొదలెట్టేసిన శ్రీను వైట్ల!
- రవితేజ హీరోగా శ్రీను వైట్ల మూవీ
- విదేశాల్లో షూటింగ్ ప్రారంభం
- త్వరలో జాయిన్ కానున్న రవితేజ
కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువగా జరుగనుంది. సైలెంట్ గా విదేశాలకి వెళ్లిన శ్రీను వైట్ల టీమ్ .. అక్కడ షూటింగును మొదలెట్టేశారనేది తాజా సమాచారం. అయితే ప్రస్తుతం రవితేజ ప్రమేయం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. 'నేల టిక్కెట్టు' సినిమా షూటింగును పూర్తి చేసేసి, ఆ తరువాత శ్రీను వైట్ల సినిమా షూటింగులో రవితేజ జాయిన్ అవుతాడని అంటున్నారు. ఈ సినిమాలో సునీల్ ఓ ముఖ్యమైన రోల్ చేయనున్న సంగతి తెలిసిందే.