charan: ఓవర్సీస్ లో 'శ్రీమంతుడు' రికార్డును క్రాస్ చేయనున్న 'రంగస్థలం'

షార్ట్స్‌లో చూడండి
ఓవర్సీస్ లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల జాబితాలో తన సినిమాను నిలబెట్టే సమయం కోసం చాలాకాలంగా చరణ్ ఎదురుచూస్తున్నాడు. ఆయన నిరీక్షణకు 'రంగస్థలం' తెరదించేదిగా కనిపిస్తోంది. వసూళ్ల పరంగా 'రంగస్థలం' తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో తన దూకుడును కొనసాగిస్తోంది.

 తొలిరోజునే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా, ఆదివారానికి 2.32 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు. ఓవర్సీస్ లో 'బాహుబాలి 2' .. 'బాహుబలి' తరువాత ఫుల్ రన్ లో 'శ్రీమంతుడు' 2.87 మిలియన్ డాలర్లను సాధించి 3వ స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో ఈ స్థానాన్ని 'రంగస్థలం' కైవసం చేసుకోనుందని చెబుతున్నారు. మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
Go Back to Shorts
charan
samanta

More Telugu News