ఆస్ట్రేలియాను శాశ్వతంగా వదిలేసిన స్టీవ్ స్మిత్!
- బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన స్మిత్
- మీడియా సమావేశం తరువాత దుబాయ్ కి పయనం
- క్రికెట్ సరంజామానంతా వెంటేసుకుని వెళ్లిన మాజీ కెప్టెన్
- దుబాయ్ లో అకాడమీని ప్రారంభించే ఆలోచన!
తన ఆటకు, క్రికెట్ కు సంబంధించి తన వద్ద ఉన్న వస్తువులన్నింటినీ ఆయన దుబాయ్ కి తీసుకెళ్లిపోవడం గమనార్హం. తాను భవిష్యత్తులో దుబాయ్ లో క్రికెట్ అకాడమీని నెలకొల్పుతానని గతంలోనే వెల్లడించిన స్మిత్, ఆ కోరికను ఇప్పుడు తీర్చుకోనున్నాడని పలు ఆస్ట్రేలియా పత్రికలు కథనాలు రాశాయి. స్మిత్ ను ఆస్ట్రేలియాలో చూసేది కష్టమేనని అభిప్రాయపడ్డాయి. అతనిపై నిషేధం ఏడాదిపాటే ఉన్నప్పటికీ, ఆ తరువాతైనా తాను ఆస్ట్రేలియా జట్టుకు ఆడేది అనుమానమేనన్న అంచనాతోనే స్మిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దుబాయ్ లో అకాడమీకి సంబంధించిన సమాచారాన్ని స్మిత్ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.