ముకేశ్ అంబానీ కాబోయే కోడలు సంపద రూ.120 కోట్లు!
- రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా
- మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ లాంటి అత్యుత్తమ కార్లు ఆమె సొంతం
- 2014లో రోజీ బ్లూ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు
ఇటీవలే ఆమె రూ.4 కోట్ల విలువైన బెంట్లీ లగ్జరీ కారును కొనుగోలు చేశారని ఫినాప్ తెలిపింది. శ్లోకా మెహతా తండ్రి రస్సెల్ మెహతా రోజీ బ్లూ ఇండియా కంపెనీకి ఎండీ. ఈ కంపెనీ ఆధ్వర్యంలో నడిచే రోజీ బ్లూ ఫౌండేషన్‌కు 2014లో శ్లోకా మెహతా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎన్జీవోలను, వాలంటీర్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 'కనెక్ట్ ఫర్' అనే సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలు. కాగా, తన చిన్ననాటి స్నేహితుడు, ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీని శ్లోకా మెహతా వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి విదితమే.