charan: 'రంగస్థలం'లో ప్రెసిడెంట్ గా అదరగొట్టిన జగపతిబాబు!
ఒక వైపున విలన్ పాత్రలు .. మరో వైపున కీలకమైన ఇతర పాత్రలను పోషిస్తూ జగపతిబాబు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే 'నాన్నకి ప్రేమతో' తరువాత ఆయనకి చెప్పుకోదగిన పాత్ర పడలేదనే చెప్పాలి. 'నాన్నకు ప్రేమతో' మూవీలో ఆయనతో విలనిజాన్ని అద్భుతంగా ఆవిష్కరింపజేసిన సుకుమార్, మళ్లీ ఇప్పుడు 'రంగస్థలం'లో ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబును ప్రేక్షకుల ముందుంచారు.
ఈ పాత్రను కొత్తగా .. పవర్ ఫుల్ గా ఆయన మలిచిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. జగపతిబాబు వేషధారణ .. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ ను కొత్తగా చూపించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ఇక ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబు ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆయన సహజమైన నటనకు వాళ్లంతా ఫిదా అవుతున్నారు. ఎంతమాత్రం ఆలోచించకుండగా ఆయనకి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు.