charan: మిలియన్ డాలర్ మార్క్ ను అలవోకగా దాటేసిన 'రంగస్థలం'

షార్ట్స్‌లో చూడండి
చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాకి, విడుదలైన అన్ని ఏరియాల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిందని అంటున్నారు. ఈ వసూళ్లు చరణ్ కెరియర్లో అత్యధికమైనవిగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇక యూఎస్ లో ఈ సినిమా తొలిరోజునే మిలియన్ డాలర్ మార్క్ ను అవలీలగా దాటేయడం విశేషం.

యూఎస్ లో సుకుమార్ సినిమాకి మంచి క్రేజ్ వుంది. 'నాన్నకు ప్రేమతో' సినిమా అక్కడ భారీ వసూళ్లను సాధించింది. సుకుమార్ సినిమాలు సంథింగ్ స్పెషల్ గా వుంటాయనే విషయం ఆడియన్స్ లోకి బాగా వెళ్లింది. అందుకు తగినట్టుగానే ఈసారి ఆయన గ్రామీణ నేపథ్యంలో కథను ఎంచుకుని పట్టుగా నడిపించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చరణ్ నటనలో పరిణతిని పూర్తిస్థాయిలో బయటికి తీసుకువచ్చిన చిత్రంగా కూడా ఇది మార్కులు కొట్టేయడం విశేషం.     
Go Back to Shorts
charan
samanta

More Telugu News