ఈ పని చేయండి.. మీ గుండెకు ఎంతో మేలు: రీసెర్చ్ రిపోర్ట్
- రోజుకు మూడు కప్పుల కాఫీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
- గుండో ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలను తగ్గిస్తుంది
- యూనివర్శిటీ ఆఫ్ సావో పౌలో అధ్యయనంలో వెల్లడి
రోజుకు మూడు కప్పుల కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీని కారణంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇదే సమయంలో రోజుకు మూడు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ సేవించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.