నేనూ తండ్రినే... నాకూ నిద్ర ఉండదు... సీబీఎస్ఈ పేపర్ లీకేజీపై సత్వర విచారణ: కేంద్ర మంత్రి జవదేకర్
- నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి
- పదో తరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్ల లీక్
- తిరిగి తర్వాత నిర్వహిస్తామని ప్రకటించిన సీబీఎస్ఈ
పదో తరగతి మ్యాథ్స్, 12వ తరగతి ఎకనమిక్స్ పేపర్లు లీక్ అయినట్టు గుర్తించడంతో వీటిని తిరిగి నిర్వహిస్తామని సీబీఎస్ఈ నిన్న ప్రకటించింది. కొత్త తేదీలను వారంలోపు వెబ్ సైట్లో ఉంచుతామని తెలిపింది. మరోవైపు ఈ ఘటనలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 25 మందిని ప్రశ్నించారు. గతంలో పేపర్ల లీక్ లకు పాల్పడిన నేరస్థులు, కోచింగ్ సంస్థల యజమానులు, ప్రశ్నా పత్రాలను ముద్రించిన ప్రింటర్ల నిర్వాహకులు ఇందులో ఉన్నారు. నిన్న రాత్రి వరకు 10 ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించారు.