'ఎనర్జిటిక్ స్టార్' రామ్ తదుపరి చిత్రం 'గరుడవేగ' దర్శకుడితో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎనర్జిటిక్ స్టార్' రామ్ తదుపరి చిత్రం 'గరుడవేగ' దర్శకుడితో!

  • యాక్షన్ మూవీగా రామ్ తదుపరి చిత్రం
  • ఎక్కువ భాగం షూటింగ్ విదేశాల్లో 
  • మంచుకొండల్లో రామ్‌తో పోరాటాలకు దర్శకుడి ప్లాన్..!
యాంగ్రీ హీరో రాజశేఖర్‌తో 'గరుడవేగ' చిత్రం తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన తదుపరి చిత్రాన్ని ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ మూవీగా ఇది రూపొందనుందని సమాచారం. ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించనున్నారని, ముఖ్యంగా స్విట్జర్లాండ్‌పైనే దర్శక నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.

రామ్‌‌లోని ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని దట్టమైన మంచుతో కప్పబడిన పర్వతశ్రేణుల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలకు దర్శకుడు ప్రవీణ్ ప్లాన్ చేసినట్లు ఫిలింవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం అందమైన లొకేషన్లను ఎంపిక చేయడానికి ప్రవీణ్ తన ప్రొడక్షన్ టీమ్‌తో పాటు గతవారం యూరప్ వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగొచ్చిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించి హీరోయిన్, సంగీత దర్శకుడు తదితర ముఖ్యమైన వివరాలు తెలిసే అవకాశముంది. రామ్ ప్రస్తుతం దిల్ రాజు సంస్థలో 'హలో గురు ప్రేమ కోసమే' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అతని కెరీర్‌లో 16వ చిత్రం.
Ram
Praveen Sattaru
Dil Raju
Switzerland

More Telugu News